ప్రణబ్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని ఉదయం 9గంటలకు సైనిక హాస్పిటల్ నుంచి 10 రాజాజీమార్గ్‌లోని అధికారిక నివాసానికి తీసుకువచ్చారు. ప్రణబ్ అధికారిక నివాసంలో ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, ప్రధాని నరేంద్రమోడి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు, కూతురును పరామర్శించారు. అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, పలువురు కేంద్రమంత్రులు, త్రివిధ దళాల సీడీఎస్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.


తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/