ప్రణబ్‌కు మ‌న్మోహ‌న్‌, రాహుల్ గాంధీ నివాళి

manmohan-singh -pays-last-respects-to-pranab-mukherjee

న్యూఢిల్లీ: మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కి మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. మ‌న్మోహ‌న్‌తో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నేతలు రాహుల్ గాంధీ, అధిర్ రంజ‌న్ చౌద‌రి, సీపీఐ నాయ‌కుడు డి రాజా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, బిజెపి ప్రెసిడెంట్ జేపీ న‌డ్డాతో పాటు ఢిల్లీ సిఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ప్ర‌ణ‌బ్‌కు నివాళుల‌ర్పించారు. కాగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రణబ్‌ పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రజలకు అవకాశమివ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రణబ్‌ ముఖర్జీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రణబ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/