కరోనా వ్యాప్తి…వారికి వర్క్ ఫ్రం హోమ్!

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ 19 పరిస్థితిని సమీక్షించారు. కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దివ్యాంగులు, గర్భిణిలు ఇంటి నంచే విధులు నిర్వహించేలా వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అలాగే, కరోనా కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లను గుర్తించి అయా అధికారులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కంటైన్మెంట్ జోన్‌ను పూర్తిగా ఎత్తివేశాకనే, కార్యాలయాలకు రావాలని కేంద్ర సర్కార్ సూచించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/