రేపు ఫ్లోర్ లీడ‌ర్స్‌తో ప్ర‌ధాని మోడి భేటీ

ఫ్లోర్ లీడర్లకు కోవిడ్ ప్రెజెంటేషన్ఇ వ్వనున్నమోడి

న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ రేపు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో భేటీ కానున్నారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడ‌ర్స్ ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు. దేశంలో కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్ పాల‌సీపై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై ఈ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్నారు. ప్ర‌ధాని కార్యాల‌య వ‌ర్గాలు సోమ‌వారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/