జులై 15న సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాలు

న్యూఢిల్లీ: పది, 12వ తరగతులకు చెందిన పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. సీబీఎస్ఈ సమర్పించిన అసెస్‌మెంట్ స్కీమ్‌ను అంగీకరించింది. పెండింగ్‌లో ఉన్న పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈతో పాటు ఐసీఎస్ఈ గురవారం ప్రకటించాయి . అయితే పెండింగ్ పరీక్షలకు అంతర్గత మదింపు ద్వారా మార్క్‌లు వేసి.. ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయనున్నది. జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజివ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారించింది. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో సీబీఎస్ఈ పదవ, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/