ఫిట్‌ ఇండియా వార్షికోత్సవంలో ప్రధాని

YouTube video
PM Modi interacts with fitness aficionados & citizens during the Fit India Dialogue.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు ఫిట్‌ ఇండియా ఉద్యమం తొలి వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఫిట్‌నెస్‌ నిపుణులు, స్ఫూర్తిప్రదాతలతో ముచ్చటించారు. ఆరోగ్యకరమైన ఆహారం మన జీవనవిధానంలో భాగమవడం సంతోషకరమని, చాలామంది అనుకునే విధంగా ఫిట్‌గా ఉండటం కష్టం కాదని, కొద్దిపాటి క్రమశిక్షణతో ఇది సాధ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండేలా మరొకరిని ప్రభావితం చేయాలని సూచించారు. కుటుంబాలు కలిసిమెలిసి ఆడుతూపాడుతూ కలిసిమెలసి సాగాలని పిలుపు ఇచ్చారు. ఫిట్‌నెస్‌ కోసం ప్రతిరోజూ అరగంట కేటాయించాలని ప్రధాని సరికొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, మోడల్‌, నటుడు, రన్నర్‌ మిలింద్‌ సొమన్‌, పోషకాహార నిపుణులు రుజుత దివాకర్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫిట్‌ ఇండియా ఫిట్‌నెస్‌ మార్గదర్శకాలను ప్రధాని మోడి ప్రారంభించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/