తాలిబన్ల దాడి..28 మంది పోలీసులు మృతి

taliban

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రేచిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొల్పేందుకు కార్యాచరణను రూపొందించడానికి ఖతర్‌లో ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్న సమయంలో దాడులు జరుగడం గమనార్హం. దక్షిణ ఉరుజ్గాన్‌ రాష్ట్ర పరిధిలో మంగళవారం రాత్రి ఈ దాడులు జరిగాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/