డిసెంబర్ 10 న పుష్ప ఐటెం సాంగ్ విడుదల

డిసెంబర్ 10 న పుష్ప ఐటెం సాంగ్ విడుదల

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ లో సమంత ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమాలో సమంతను ఎంత హాట్ గా చుపించారో..ఏ రేంజ్ లో స్టెప్స్ వేయించారో అని అంత ఎదురుచూస్తున్న క్రమంలో ఈ సాంగ్ తాలూకా అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్.

” ఊ అంటావా.. ఊ హు అంటావా ” అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ను డిసెంబర్ 10 న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. అలాగే సామ్ తాలూకా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఐటమ్ సాంగ్ చేయడం తో.. అందరూ ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సాంగ్ తాలూకా షూటింగ్ ను హైదరాబాద్ లో పూర్తి చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ స్పెషల్ నంబర్ లో బన్నీ – సామ్ స్టెప్పులు ప్రత్యేకంగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘పుష్ప’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ – సునీల్ – అనసూయ – ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.