తాలిబన్లు భారత్ వైపు కదిలితే ఎయిర్ స్ట్రయిక్స్ తప్పవు

తాలిబన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశపరుచుకున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ప్రస్తుతం తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. మరోవైపు ఇండియాలో తాలిబన్లు ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తాలిబన్ల వల్ల ఆప్థనిస్థాన్, పాకిస్థాన్ రెండు దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. భారత్ వైపు రావాలని తాలిబన్లు ప్రయత్నిస్తే… ఎయిర్ స్ట్రయిక్స్ ను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హెచ్చరించారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రకాలుగా శక్తమంతమయిందని అన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇతర దేశాలు భయపడే పరిస్థితి ఉందని చెప్పారు. తాలిబన్లు భారత్ వైపు కదిలితే ఎయిర్ స్ట్రయిక్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/