ఓ వైపు బాధను దిగమింగుకుంటూ…తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా: ప్రధాని మోడీ

సర్థార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి మోడీ నివాళులు

YouTube video
PM Modi attends Rashtriya Ekta Diwas Parade 2022 in Kevadia, Gujarat

గాంధీనగర్‌ః గుజరాత్‌లో సర్థార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏక్తానగర్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ సందర్భంగా సర్ధార్‌ వల్లభాయిపటేల్‌ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులర్పించారు. నర్మదా నదిలోని సర్థార్ వల్లభాయి పటేల్ విగ్రహం పాదాలకు మోడీ పాలాభిషేకం నిర్వహించారు. ఏక్తా దివస్ వేడుకల్లో త్రివిధ దళాల పరేడ్ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ప్రధాని మోడి గుజరాత్​ మోర్బి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తాను ఏక్తా నగర్‌లో ఉన్నా..మనసు మాత్రం మోర్బీ బాధితులపైనే ఉందన్నారు. ఓ వైపు బాధను దిగమింగుకుంటూ…తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాని చెప్పారు. మోర్బి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మోడీ సానుభూతి తెలియజేశారు. బాధితు కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు. ఇప్పటికే సీఎం భూపేంద్ర పటేల్ ఘటన స్థలానికి చేరుకున్న అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు.

సర్థార్ వల్లభాయి పటేల్ వల్లనే భారత దేశం ఏకమైందని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్ర సమయంలో పటేల్ నాయకత్వం లేకుంటే ఏ జరిగి ఉండేదో అని ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఎంతో ధైర్యం, సాహసాలతో..550 పైగా సంస్థానాలను ఏకం చేశారని గుర్తు చేశారు. సర్ధార్ పటేల్ భారతదేశం పట్ల అంకితభావాన్ని చూపకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. భారత ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోడీ.. స్టాచ్యు ఆఫ్ యూనిటీ వద్ద మరో పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎదురుగా జంగిల్ సఫారీకి సమీపంలో ఏర్పాటు చేసిన మియావాకి ఫారెస్ట్ గార్డెన్, భుల్భులయ్య పార్క్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రజలకు అంకితం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/