టిడిపి-జనసేన తొలి జాబితా విడుదల

TDP-Janasena first list released

అమరావతి: టిడిపి, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంయుక్తంగా తొలి జాబితాను ప్రకటించారు. టిడిపి 94, జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌, టెక్కలి-అచ్చెన్నాయుడు, ఆముదాలవలస-కూన రవికుమార్‌ పేర్లను ప్రకటించారు. కాగా, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు కుప్పంలో, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నారు. బిజెపితో పొత్తు క్లారిటీ వచ్చిన తరువాత రెండో జాబితాను విడుదల చేయనున్నారు. మాఘ పౌర్ణమి శుభదినాన శుభ ముహూర్తంలో టిడిపి-జనసేన పార్టీలు ఎన్నికల్లోకి వెళ్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.

టీడీపీ అభ్యర్థులు

ఆముదాలవసల – కూన రవికుమార్
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
కురుపాం – జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్ బొనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి – బేబీ నాయన
గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – పూసపాటి అదితి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణబాబు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం – మహాసేన రాజేష్
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు – కొలుసు పార్థసారథి
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
నూజివీడు – కొలుసు పార్థసారథి
నందిగామ – తంగిరాల సౌమ్య
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
వేమూరు – నక్కా ఆనందబాబు
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి – డోలా బాలవీరాంజనేయులు
ఒంగోలు – దామచర్ల జనార్థన్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జనసేన అభ్యర్థులు

నెల్లిమర్ల- మాధవి
అనకాపల్లి- కొణతాల
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
తెనాలి-నాదెండ్ల మనోహర్

అంతకముందు టిడిపి ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్యప్రసాద్‌తో సమావేశమయ్యారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల పేర్ల అంశంపై చర్చించారు.