బ్రెజిల్‌ నూతన అధ్యక్షుడిగా లూలా డా సిల్వా ఎన్నిక

Brazil’s Veteran Leftist Lula Wins Presidential Polls, Bolsonaro Defeated

జెనీరో: బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని వరుసగా మూడోసారి చేపట్టాలని భావించిన జైర్‌ బోల్సనారోకు చుక్కెదురయింది. లెఫ్టిస్ట్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్‌ ఇన్‌సియో లులా డా సిల్వా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 77 ఏండ్ల డా సిల్వా.. 51 శాతం ఓట్లతో బోల్సనారోపై విజయం సాధించారు. దీంతో ఆయన మరోసారి అధ్యక్షుడిగా బాధ్యలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో బోల్సనారోకి 49 శాతం (5,82,05,917) ఓట్లు లభించాయి.

బ్రెజిల్‌ చరిత్రలో అత్యంత ప్రజాధరణ పొందిన అధ్యక్షుడిగా డా సిల్వా పేరొందారు. అయితే వివాదాస్పదమైన అవినీతి ఆరోపణలతో 2010లో అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు. అనంతరం 18 నెలలపాటు జలుశిక్ష అనుభవించాడు. 1970వ దశకంలో బ్రెజిల్‌లోని మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన డా సిల్వా.. దేశ 35వ అధ్యక్షుడిగా 2003 నుంచి 2010 వరకు పనిచేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః