డా.జోసెఫ్ మర్ తోమా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

YouTube video
PM Modi attends 90th birth anniversary celebrations of Dr. Joseph Mar Thoma Metropolitan via VC

న్యూఢిల్లీ: డాక్టర్ జోసెఫ్ మర్ తోమా మెట్రోపాలిటన్ 90వ జన్మదిన వేడుకల్లో ప్రధాని నరేంద్రమోడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేరళలోని మర్ తోమా దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరారు. డాక్టర్ జోసెఫ్ మర్ తోమా ఈ దేశం కోసం, మన సమాజం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టారన్న మోడి, దేశంలో పేదరికాన్ని తగ్గించేందుకూ, మహిళల్లో కాన్ఫిడెన్స్ పెంచేందుకు ఎంతగానో కృషి చేశారని మెచ్చుకున్నారు. కాగా భారత్‌లో పాటు ప్రపంచంలోని మర్ తోమా చర్చి ఫాలోయర్లు 3 లక్షల మంది కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/