కనకదుర్గ ఆలయంలో జులై 3 నుంచి శాకంబరీ ఉత్సవాలు

కనకదుర్గ ఆలయంలో జులై 3 నుంచి శాకంబరీ ఉత్సవాలు
Shakambari celebrations at Kanaka Durga Temple

విజయవాడ: ఆషాడ మాసం నేపథ్యంలో కనకదుర్గ ఆలయంలో జులై 3వ తేదీ నుంచి శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు.. మూడవ తేదీన ఉదయం 6 గంటలకు ప్రారంభమై.. 5వ తేదీన ఉదయం పుర్ణాహుతితో ముగియనున్నాయి. శాకంబరీ ఉత్సవాలకు వచ్చే భక్తులు టికెట్లను ఆన్‌లైన్ స్లాట్ ప్రకారం టిక్కెట్ బుక్ చేసుకునే రావాలన్నారు. కరోనా దృష్ట్యా శాకంబరీ ఉత్సవాల తొలి రెండు రోజులు అంతరాలయంలో మాత్రమే శాకంబరీ అలంకారం నిర్వహించనున్నారు.

మూడో రోజు కూరగాయలతో మహామండపంతో పాటు ఇతర ప్రాంగణాలు అలంకరించనున్నట్టు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు తెలిపారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబ ప్రసాదం భక్తులకు అందచేస్తామన్నారు. శాకంబరీ ఉత్సవాలకు కూరగాయలను తీసుకొనుటకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బోనాల కమిటీ సభ్యులు జూలై 5న అమ్మవారికి బోనాలు సమర్పిస్తారన్నారు. జులై 1 నుంచి దేవస్ధాన కేశఖండన శాల నందు తలనీలాలు తీసేందుకు అనుమతిస్తున్నామన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/