జర్మనీలో ప్రతిరోజు 500 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసులు సంఖ్య 1,93,243

germany- coronavirus

బెర్లిన్‌: జర్మనీలో కరోనా తాండవం కొనసాగుతుంది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిరోజు 500ల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా శుక్ర‌వారం ఉద‌యం నుంచి శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు కొత్త‌గా 687 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,93,243కు చేరి రెండు ల‌క్ష‌ల‌కు చేరువ‌య్యింది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో ఆరుగురు క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 8,954కు చేరింది. మొత్తం కేసుల‌లో 1,77,500 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగ‌తా వారు జ‌ర్మ‌నీలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/