పునీత్‌కు నివాళులు అర్పించిన ఎన్టీఆర్..

కన్నడ పవర్ స్త్ర పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల పునీత్ మరణ వార్త ఎవ్వరు తట్టుకోలేకపోతున్నారు. కడసారి ఆయన్ను చూసేందుకు అభిమానులే కాదు అన్ని చిత్రసీమ ప్రముఖులు బయలుదేరారు.

టాలీవుడ్ నుండి సైతం పలువురు ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ పునీత్ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించి ఆయన కుటుంబ సబ్యులకు ధైర్యం చెప్పగా..కొద్దీ సేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ సైతం నివాళ్లు అర్పించారు. చిరంజీవి, మహేశ్ సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ పునీత్ మృతదేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

ఇక పునీత్‌కు తెలుగు హీరోలతో మంచి అనుబంధాలు ఉన్నాయి. మెగా ఫ్యామిలీతో పాటు నందమూరి ఫ్యామిలీ, మహేశ్ ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీలతో పునీత్ రాజ్ కుమార్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా తారక్, డైరెక్టర్ పూరి జగన్నాధ్ అంటే పునీత్‌కు ప్రత్యేకమైన అభిమానం.