మీ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమన్న సోనియా

వి.హనుమంతరావుకు ఫోన్ చేసిన సోనియాగాంధీ

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వీహెచ్ కు ఆమె నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా తన ఆరోగ్యం బాగానే ఉందని సోనియాకు వీహెచ్ తెలియజేశారు. జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వీహెచ్ కు సోనియా సూచించారు. త్వరగా కోలుకోవాలని, మీ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి అవసరమని చెప్పారు. తనకు ఫోన్ చేసిన సోనియాకు వీహెచ్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/