లాక్‌డౌన్‌ను పాటించండి.. కోహ్లీ

పాటించని వారు నా దృష్టిలో దేశ భక్తులు కాదు

virat kohli
virat kohli

దిల్లీ: కరోనా విస్తరిణి అరికట్టేందుకు కేంద్రం లాక్‌ డౌన్‌ ప్రకటించగా, చాలా మంది లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారు. వీరిపట్ల కోహ్లీ అసహనాన్ని వ్యక్తం చేశాడు. వీరిని ఉద్దేశ్యించి ట్విటర్‌లో ఓ విడియో పోస్ట్‌ చేశాడు. ఆటగాడిగా కాదు, దేశ పౌరుడిగా మాట్లాడుతున్నా. గత కొన్ని రోజులుగా ప్రజల నిర్లక్ష్య వైఖరి చూస్తున్నా. లాక్‌డౌన్‌, కర్ఫ్యూ లాంటివి పట్టించుకోకుండా రోడ్లపై గుంపులుగా సంచరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కరోనా వైరస్‌ను మీరు తేలిగ్గా తీసుకున్నారని అనిపిస్తుంది. కాని, మనం ఊహించినట్టుగా ఇది సాదారణమైనది కాదు. సరదా కోసం రోడ్లపైకి రాకండి. అలా చేసేవాళ్లు నా దృష్టిలో దేశ భక్తులు కాదు. దయచేసి సోషల్‌ డిస్టెన్స్‌ పాటించండి. ప్రభుత్వ సూచనలు పాటించండి. ఈ దేశానికి మీ మద్దతు, సహయం అవసరం. అని కోహ్లీ విజ్ఞప్తి చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/