ఇక్కడ: ఉంటామంటే ఉండనీయరు.. అక్కడ : వస్తామంటే రానీయరు..
జాతీయ రహదారి చెక్ పోస్ట్ వద్ద చిక్కుకు పోయిన ౩వేల మంది వలస కూలీలు

Guntur: గ్రామాలకు వెళ్ళేందుకు బయలుదేరి కరోనా ఎఫెక్ట్ తో చెక్ పోస్ట్ లో 3000 మంది వలస కూలీలు చిక్కుకు పోయారు.
ప్రకాశం జిల్లా గుట్ల ఉమ్మడివరం చెక్ పోస్ట్ కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపైవలస కూలీలు పిల్ల పాపలతో నీళ్ళు తిండి లేక అవస్థలు పడుతున్నారు.
జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని పోలీసులు అంటున్నారు.

ఈ మూడు వేల వలస కూలీలు రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు వలస వెళ్ళారు.
కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో గుంటూరు జిల్లా అధికారులు మీ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆదేశించడంతో వీరు స్వ గ్రామాలకు వెళ్ళేందుకు వంద వాహనాలలో బయలుదేరి వచ్చి ప్రకాశం గుంటూరు బోర్డర్ లోని చెక్ పోస్ట్ వద్ద చిక్కుకున్నారు.

ఉన్నచోట గుంటూరు జిల్లా అధికారులు ఉండనీయ లేదని సొంత గ్రామాలకు వెళతామంటే ప్రకాశం జిల్లా అధికారులు కనికరించడం లేదని వలస కూలీలు వాపోయారు
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/