జగన్ ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో పని చేస్తానంటున్న ఎమ్మెల్యే పిన్నెల్లి

మంత్రివర్గ ఏర్పటు తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాస్త అసంతృప్తికి గురయ్యారు. తనకు మంత్రి ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు కానీ మంత్రి ఛాన్స్ ఇవ్వకపోయేసరికి పార్టీ అధిష్టానం కన్నెర్ర చేసారు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం ముఖ్యమంత్రి జగన్ ..పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని విజయవాడ కు పిలిపించుకొని మాట్లాడాలి కాస్త శాంతింపచేసారు.

జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌లో సామాజిక సమీకరణలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. అందువల్ల సీనియర్లకు అవకాశం రాలేదని, తమ టార్గెట్ 2024 ఎన్నికలు అని, దానికోసం ఏ బాధ్యత ఇచ్చినా పూర్తిస్థాయిలో పని చేస్తానని తెలిపారు. పార్టీ కోసం దేనికైనా సిద్ధమని, తనకు ఏ హామీ ఇవ్వలేదని తెలిపారు. హామీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు. జగన్‌ తనకు బీ ఫామ్ ఇవ్వబట్టే ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తుచేశారు. ఆయన ఏమి చేసినా పార్టీ మంచి కోసమే చేస్తారని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎవరికీ అన్యాయం చేయరని, అందరూ పార్టీ కోసం పని చేయాల్సిందేని తెలిపారు.