కాంగ్రెస్ అవినీతిపై నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయిః కుమారస్వామి

జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసి చూపించిన స్వామి

‘I have the evidence in a pen drive’: Kumaraswamy makes corruption charges against Congress govt in Karnataka

కర్ణాటకః ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీపై మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి భాగోతమంతా తన వద్ద ఉందని ఈరోజు ఆయన మరోసారి అన్నారు. కాంగ్రెస్ అవినీతికి చెందిన సాక్ష్యాలు తన జేబులోనే ఉన్నాయని చెపుతూ… జేబులో నుంచి ఒక పెన్ డ్రైవ్ ను బయటకు తీసి చూపించారు. సాక్ష్యాలను తాను జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నానని చెప్పారు. ఎప్పుడైనా వాటిని విడుదల చేస్తానని అన్నారు. ఆఫీసర్ల పోస్టింగులకు బాధ్యత గల మంత్రి డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని… ఈ అంశాన్ని తాము అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు.