వర్తమానంలో జీవించాలి

‘మనస్విని’ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం

Thinking-
Thinking-

మేడమ్‌! నా వయసు 40 సంవత్సరాలు. నాకు ఒక పాప. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ విషయమై మా అమ్మా నాన్నలు గొడవపడ్డారు. మా నాన్న ఆరోగ్యం బాగా చెడిపోయింది ఈ గొడవల వల్ల. వారిద్దరి గొడవలు చూస్తుంటే నాకు ఏమి చెయ్యాలో తెలియటం లేదు. మా అమ్మానాన్నకు నచ్చచెప్పటం ఎలా? కొంచెం వివరించండి ప్లీజ్‌. – మేఘన

మీరు తప్పక మీ అమ్మనాన్నల సమస్యలను దూరం చేయగలరు. దానికి కావల్సింది మీరు వారికి అండగా ఉండటం. మీరు వారికి ధైర్యాన్నిస్తే, వారిని అర్ధం చేసుకుంటే, వారికి సహాయంగా ఉంటే వారి బాధలు కొంతైనా తగ్గుతాయి. మీ తల్లిదండ్రులకు తగు కౌన్సిలింగ్‌ ఇప్పించండి. మీరు సంతోషంగా ఉండండి. మీరంతా కలసి మెలసి ఉండాలి.

ఎదుటి వారిలో తప్పులు వెతకవద్దు. వారిలోని మంచిని గ్రహించండి. ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. గృహవాతావరణం ఆనందంగా మలచుకోవాలి. సానుకూలంగా ఆలోచించాలి. ప్రవర్తనలో సరియైన మార్పులు తెచ్చుకోవాలి. పిరికితనం పనికిరాదు. ధైర్యంగా ఉండాలి. భయందోళనలు దగ్గరకు రానీయవద్దు. భయంతో చాలా సమస్యలు వస్తాయి.

ప్రతినిత్యం జాగరూకతతో ఉండాలి. జీవితం అపూర్వమైన కానుక. దానిని సద్వినియోగం చేసుకుని ఆనందమైన జీవితం గడపాలి. ఇవన్నీ మీరు మీ తల్లిదండ్రులకు అర్ధం అయ్యేలా తెలియజెప్పాలి. మీరు కూడా స్వయంగా, ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండాలి.

అంతా మనచేతుల్లోనే ఉంది. మన భవిష్యత్‌ మనచేతుల్లోనే ఉంది. స్పష్టతతో, అవగాహనతో ఉంటే జీవితాన్ని ఆనందంగా తీర్చి దిద్దుకోవచ్చు. వర్తమానంలో జీవించాలి.

గతం గరించి చింతవద్దు. భవిష్యత్‌ గురించి ఆందోళన వద్దు. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. శారీరకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

మంచి ఆహారం, మంచినిద్ర, ప్రశాంతత, ఆనందం అన్నీ ఉండాలి. ఇవన్నీ మీరు మీ తల్లిదండ్రులకు స్నే హపూర్వకంగా తెలియజెప్పాలి. వారికి సహాయంగా ఉండాలి. అప్పుడు అంతా బాగుంటుంది.

జీవనశక్తిని పెంపొందించుకోవాలి

మేడమ్‌! నా వయసు 65 సంవత్సరాలు. నాకు ఈ మధ్య చాలా ఒంటినొప్పులు, కాలినొప్పులు మొదలయ్యాయి. డాక్టర్లకు చూపిస్తే మందులు ఇస్తున్నారు కానీ తగ్గటం లేదు. ఇంకా నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కూడా. ఏం చేస్తే నాకు ఈ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కొంచెం వివరించండి మేడమ్‌. – వసుంధర

మీరు తప్పక ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు. శారీరక ఆరోగ్యానికి మూం మానసిక ఆరోగ్యం. అందువల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి.

మానసికంగా ప్రశాంతంగా ఉంటూ, వైద్యుల సలహాల ప్రకారం మందులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంచి మంచి మందులు దొరుకుతున్నాయి. వాటిని తీసుకుంటూ, మానసిక ఉల్లాసాన్ని కూడా పెంపొందించుకోవాలి. మానసికంగా ఉత్సాహంగా ఉండాలి.

పరిశోధనలను చదవాలి. అప్పుడు మీకు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో మంచి వైద్య సదుపాయాలు, ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నాయి. వాటిని చక్కగా అందిపుచ్చుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవ్వగలరు.

అన్నింటికీ మించి మంచి ప్రశాంతమైన జీవనశైలిని అలవరచుకోవాలి. సానుకూలంగా ఆలోచించాలి. ఎల్లప్పుడూ చక్కని వ్యాపకాలతో, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిరుత్సాహాన్ని ఆందోళనను, భయాందోళనలను దరికి చేరనీయవద్దు.

స్ఫూర్తిప్రదాతల ద్వారా మంచి అలవాట్లను అలవరచుకోవాలి. ప్రశాంత చింతనలతో, సంపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించాలి. మీదైన ఒక సొంత వ్యాపకంతో, సమయాన్ని ఆనందమయంగా మలచుకోవాలి. ద్వేషభావాలను రాగద్వేషాలను దూరంగా ఉంచాలి.

ప్రేమ, సౌభ్రాతృత్వం ద్వారా జీవనశక్తిని పెంపొందించుకోవాలి. నైరాశ్యాన్ని దరికి చేరనీయవద్దు. అప్పుడు మీకు ఎంతో ఆనందం వస్తుంది.

అప్పుడు శారీరక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇందులో సందేహం లేదు. పరిశోధన వల్ల తేలింది ఇదే.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/