గోరువెచ్చని నీరే మంచిది

ఆరోగ్యం- సంరక్షణ

Warm water is good
Warm water is good

తాగునీటి ప్రాముఖ్యత అందరికీ తెలుసు. మంచినీరు లేకుండా జీవించడం అసాధ్యం. నీరు తాగడం వల్ల శరీరం సజావుగా పనిచేస్తుంది.

మనిషి బరువును బట్టి, వయోజనులు ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.

మనలో చాలా మంది సాధారణ ఉష్ణోగ్రతలలో నీటిని తీసుకుంటారు. కొందరికి రిఫ్రిజిరేటెడ్‌ నీరు తప్ప వేరే నీరు అవసరం ఉండదు.

కానీ గోరువెచ్చని నీరు సాధారణ నీటి కంటే ఆరోగ్యానికి మంచిది. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది.

Warm water is good

భారతీయ వైద్యశాస్త్రం ప్రకారం, ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తీసుకుంటే శరీరం తేలికగా ఉంటుంది. ముక్కు కట్టడం లేదా ముక్కుదిబ్బడతో తలనొప్పి వస్తుంది.

వేడినీటి ఆవిరితో వెంట్రికిల్‌ శ్లేష్మ పొర విప్పుకుని కఫాన్ని నివారిస్తుంది.

వేడినీరు తాగడం వల్ల కడుపు, పేగులలో నీరు కదుతున్నప్పుడు, చల్లటి నీటి కంటే ఎక్కువ తేమ ఉండి మలినాలను త్వరగా తొలగిస్తుంది. శరీరానికి తేమ లభించడంవల్ల నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది.

Warm water is good

రుమటాయిడ్‌, ఆర్ధరైటిస్‌, ఇతర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి వేడినీరు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఉదయం ఒక గ్లాసు వేడినీరు తాగడం వల్ల శరీర రసాయన పనితీరు సక్రమంగా ఉంటుంది.

వేడి నీరు వివిధ గుండె సమస్యల నుండి రక్షిస్తుంది. శరీరంలో అన్ని పనులకు తేమ అవసరం. ఇందుకు నీరు అవసరం.

చల్లటి నీటికి బదులుగా వేడినీరు మరింత ప్రభావంతంగా పనిచేస్తుంది. హృదయస్పందన రేటు పెంచుతుంది. నిర్జలీకరణ, వికారం, అలసట, తలనొప్పుల నుండి రక్షణనిస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/