తెలుసుకో: తియ్యటి రసాన్నిచ్చే పైనాపిల్‌

చక్కటి ఆరోగ్యము

PineApple

పండరసాల్లో వెంటనే గుర్తుకు వచ్చేది పైనాపిల్‌ జ్యూస్‌. తెలుగు ఈ పండు పేరు అనాస. అయినప్పటికీ పైనాపిల్‌ అనే ఎక్కువ మంది పిలుస్తారు. ఇది ఒక పొదజాతి మొక్క. చూడాటానికి విచ్చుకున్న పచ్చని కలువలా ఉంటుంది. ఆకులు పొడవునా ముళ్లతో ఉంటాయి. దీని జన్మస్థలం దక్షిణ అమెరికా. ప్రస్తుతం ప్రపంచమంతా విస్తరించింది.

ప్రపంచవ్యాప్తంగా పైనాపిల్‌ ఉత్పత్తిలో 60 శాతం హావాయిలో పండుతుంది. అమెరికన్‌ ఆదివాసులు దీన్ని దేవతాఫలంగా భావించేవారు. పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిలువలు అధికంగా ఉంటాయి. సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అటవీ రకానికి చెందిన పైనాపిల్‌ మొక్కలు 50 సంవత్సరాల వరకు బతుకుతాయి.

ప్రస్తుతం వాణిజ్యపరంగా పెంచుతున్న రకాలు మాత్రం రెండు నుంచి మూడు కాతల వరకు మాత్రమే బతుకుతున్నాయి. పైనాపిల్‌ను ఆల్కహాల్‌, వెనిగర్‌ తయారీలో వాడుతారు. పైనాపిల్‌ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.

దంతాల నుంచి రక్తం కారే వ్యాధి నుండి రక్షణ కల్పిస్తుంది. పూర్తిగా పండని పండు రసం కూడా మనకు మేలు చేస్తుంది. ఆ రసం తీసుకుంటే కడుపులో నులిపురుగులు చని పోతాయి. దీంట్లో పీచు పదార్థం ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో దీన్ని మాంసాహార వంటల్లో ఉపయోగిస్తారు. పైనా పిల్‌ కాయ చెట్టు మీద పండాలంటే అందుకు సుమారు 3 సంవత్సరాలు పడు తుంది. అందుకే కాయగా ఉన్నప్పుడు దాన్ని చెట్టు నుండి వేరు చేస్తారు.

ఈ చెట్టుకు పూసే పువ్ఞ్వ 12 నుంచి 20 నెలల తర్వాత కాయగా మారుతుంది. ఒక సీజన్‌లో ఒకే పువ్ఞ్వ పూస్తుంది. ఒకే కాయ కాస్తుంది. ఈ మొక్క 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. మనదేశంలో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్ల పండిస్తారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/