తెలుసుకో: మానవులంతా సమానమన్న సంత్ కబీర్

మతవిప్లవం తీసుకొచ్చి, హిందూ ముస్లింలను విమర్శించి, మానవులందరూ సమానమన్నవాడు కబీర్. ‘కబీర్ అరబీ పదం, గొప్పవాడని అర్ధం. అతడు తాత్వికుడు, వాస్తవికుడు, హేతువాది, కాని భక్తుడు, పరిపక్వత గల సిద్ధుడు. అతడు హిందువో, ముస్లిమో తెలియకుండా బ్రతికాడు. ముస్లిం రాజు సికిందర్ నానాహింసలు పెట్టినా, హిందువ్ఞలు కష్టపెట్టినా, దెబ్బలకు దేహం గాయడినా హృదయంలో గాయపడేవాడు కాదు. కబీర్ గొప్ప మానసిక స్థితిలో ఉండేవాడు.
నాదాన్ని, నిరాకారుణ్ణి ఉపాసించేవాడు. మసీదులో ఖుదా ఉంటే, ఆలయంలో రాముడుంటే ఈ రెండూ లేనిచోట ఎవరుంటారు అని అడుగుతాడు. దేవ్ఞడు ఒక్కడే అయితే ద్వైతమూ అద్వైతమూ అంటూ రెండెందుకు అని ప్రశ్నిస్తాడు. ‘నీ చర్మానికి నొప్పి కలిగితే మేక చర్మానికి నొప్పి కలగదా అని తర్కిస్తాడు. శూన్యత్వం గుర్తుకు తెస్తాడు.
అది బౌద్ధుల శూన్యతకావచ్చు. వేరే సిద్ధాంతం కావచ్చు. సంకుచిత మతాలను, దృక్పథాలను కబీర్ పరిహరిస్తాడు. అగ్రకులజుడు, అధమ కులజుడు అనే విభజనను చెండాడుతాడు. ‘నీవ్ఞ బ్రాహ్మణుడవైతే, వేరే ద్వారం గుండా బయటికి వచ్చావా అని ముఖాన అడిగేస్తాడు. జపతప తీర్థయాత్ర ఆహాకార బూడిదలన్నిటిని అపహాస్యం చేస్తాడు.
బాహ్యాచారాలని గుట్టును బట్టబయలు చేస్తాడు. అతడొక సూఫీ ప్రేమికుడు. దాడిచేస్తాడు గానీ ద్వేషించడు. ‘కళ్లు తెరిచి సౌందర్యం ఎల్లెడల చూస్తాను అంటాడు. కబీర్ అటే గురునానక్‌కి ఇష్టం.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/