స్వరూపానంద స్వామికి చేదు అనుభవం
గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చిన స్వామి

గుంటూరు: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చారు. ఈసందర్భంగా ఆయనకు అమరావతిలో నిరసన సెగ తగలింది. స్వామి స్వరూపానంద వచ్చిన వాహనానికి అడ్డు వెళ్లిన తెలుగు మహిళా కార్యకర్తలు ఆయనపై మండిపడ్డారు. గతంలో యాగాలు చేసి జగన్ను గెలిపించారని వారు అన్నారు. అమరావతిలో రాజధానిని కొనసాగించేలా యాగం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అమరావతి కోసం కోసం స్వరూపానంద పూజలు చేశారని, మరిప్పుడెందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు. కాగా అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనలు 52వ రోజు కొనసాగుతున్నాయి.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/