ఏపీ రాజకీయ పార్టీలకు మరోషాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

Pilot Rohit Reddy gave shock to AP political parties

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏపీ రాజకీయ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బిఆర్ఎస్ ఇప్పుడు మిగతా రాష్ట్రాల రాజకీయ పార్టీల్లో టెన్షన్ రేపుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో కేసీఆర్ సంప్రదింపులు చేస్తూ బిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఏపీలో జనసేన పార్టీ కి చెందిన నేతలతో పాటు ఇతర మాజీ ఐఏఎస్ లను బిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లో ఏపీ నుండి భారీ ఎత్తున నేతలు బిఆర్ఎస్ లోకి చేరబోతున్నట్లు పైలట్ రోహిత్ రెడ్డి తెలిపి షాక్ ఇచ్చారు.

మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పైలట్ రోహిత్ రెడ్డి..అనంతరం మీడియా తో మాట్లాడుతూ..బిఆర్ఎస్ కి ఏపి నుంచి అన్యూహ స్పందన లభిస్తుందని , ఎవరు ఉహించని విధంగా ఏపి నుంచి నాయకులు బిఆర్ఎస్ లో చేరుబోతున్నారని స్పష్టం చేశారు. విభజన తరువాతే కేసిఆర్ నాయకత్వం కారణంగా తెలంగాణ అభివృద్ది చెందిందని వెల్లడించిన రోహిత్ రెడ్డి..సరైన నాయకత్వం లేకపోవడంతోనే దేశం,ఏపి అభివృద్ది చెందలేదని వివరించారు.

ఇక నిన్న సోమవారం ఏపీకి చెందిన నేతలు రిటైర్డ్‌ ఐఏఎస్‌ డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌, మాజీ మంత్రి రావెల కిశోర్‌, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసిన చింతల పార్థసారథి బీఆర్‌ఎస్‌లో చేరారు. వారితోపాటు టీజే ప్రకాశ్‌ (అనంతపురం సీనియర్‌ నేత), తాడిపాక రమేశ్‌నాయుడు (కాపునాడు జాతీయ అధ్యక్షుడు), గిద్దల శ్రీనివాస్‌నాయుడు (కాపునాడు ప్రధాన కార్యదర్శి), జేటీ రామారావు (ఆంధ్రప్రదేశ్‌ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు), రాధాకృష్ణ, బంగార్రాజు (ముమ్మిడివరం), శ్రీనివాసయాలు (కొత్తపేట), జీ శ్రీనివాసునాయుడు (అవిడి), వెంకటేశ్వర్‌రావు (గురిజాల), వంశీకృష్ణ, సతీశ్‌కుమార్‌ (నూజివీడు), ఉంజనేని అశోక్‌, యూ ఫణికుమార్‌ (గుడివాడ), తోటకూర కోటేశ్‌, నయీం ఉల్‌ ముల్క్‌ (నందిగామ), భారతి (మంగళగిరి) ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పారు.