వారసుడు రివ్యూ ఇచ్చేసిన రామ్ చరణ్

సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి తో పాటు తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు మూవీ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. మహర్షి ఫేమ్ వంశీ పైడి పల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషలతో పాటు మిగతా భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా ఈ మూవీ ఎలా ఉందొ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ప్రస్తుతం చరణ్..శంకర్ డైరెక్షన్లో #RC15 చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన పనుల నిమిత్తమే అతను రీసెంట్‌గా చెన్నైలోని తమన్ రికార్డింగ్ స్టూడియోకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే #RC15తో పాటు విజయ్ ‘వారిసు’ చిత్రానికి కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ క్రమంలో తమన్ స్టూడియోకు వెళ్లినపుడు అక్కడే ఉన్న దిల్ రాజు.. చరణ్ కోసం ప్రత్యేకంగా ‘వారిసు’ ప్రైవేట్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడట. దీంతో చరణ్ మొత్తం సినిమా చూసేయగా.. తనకు బాగా నచ్చడంతో మూవీ టీమ్‌‌ను అప్రిషియేట్ చేశాడని టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా 13 న ఈ మూవీ తెలుగు లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. మరి చిరు , బాలయ్య ను తట్టుకొని విజయ్ ఏ మేరకు అలరిస్తాడో ..ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడతాడో చూడాలి.