మరో సారి ఊ.. అంటుందా ?

‘లైగర్‌’ లో స్పెషల్ సాంగ్ కోసం పూరి టీం సంప్రదింపులు !

Samantha in another special song?
Samantha

సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు మరో క్రేజీ ఆఫర్‌ రానుందని సమాచారం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘లైగర్‌ ‘ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్‌ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఆ పాట కోసం సమంతను ఎంచుకోవాలని దర్శకుడు భావిస్తున్నారు తెలిసింది. ఈ చిత్రాన్ని దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్పెషల్ సాంగ్ లో సమంత నర్తించనుందో ? లేదో ? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయక తప్పదు మరి.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/