దళిత బంధు పథకంపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దళిత బంధు కోసం ప్రభుత్వం 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర నరేష్ హైకోర్టును కోరారు. అయితే, పిటిషనర్ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో కూడా ఇదే అంశంపై పిటిషన్ వేశారని గుర్తు చేసిన హైకోర్టు… అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది.

కాగా, రాష్ట్రంలోని దళితుల జీవితాలను సమూలంగా మార్చివేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం గురువారం(ఆగస్ట్ 5) ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం రూ.7.60 కోట్లు విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుల్లోకి వచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/