వివేకా హత్య కేసు సునీల్ యాదవ్ కు 10 రోజుల కస్టడీ

కీలక అనుమానితుడిగా సునీల్ యాదవ్

కడప : మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో కోర్టు సునీల్ యాదవ్ కు 10 రోజుల సీబీఐ కస్టడీ విధించింది. సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల సునీల్ ను గోవాలో అరెస్ట్ చేయగా, ఈ నెల 4 నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ కుమార్ తీరు అనుమానాస్పదంగా ఉన్నట్టు భావిస్తున్నారు. వివేకా హత్య తర్వాత సునీల్ ఇంటికి తాళం వేసి ఉండడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/