చివరి రోజు కూడా పవన్ కళ్యాణ్ ను వదలని పేర్ని నాని

మంత్రిగా చివరి రోజు కూడా పేర్ని నాని..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వదల్లేదు.పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. పేర్ని నాని మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఫై నిత్యం విమర్శలు , కౌంటర్లు , సెటైర్లు వేస్తూ ఉండే నాని..పవన్ కళ్యాణ్ హాబీగా రాజకీయాలు చేస్తుంటారని.. పుల్ టైమ్ పొలిటీషీయన్ వేరని, పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని కామెంట్స్ చేసాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్క మాట మీద నిలబడ్డారా..? అని ప్రశ్నించారు.

2012లో పార్టీ పెట్టడానికి చంద్రబాబును కలిశానని అన్నారు.. చంద్రబాబు ఏమైనా ఎలక్షన్ కమిషనా అని అన్ని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబుకు ఓటేయాలని, మోదీకి ఓటేయాలని అన్నాడు..2017లో గుంటూర్ లో మీటింగ్ పెట్టి చంద్రబాబు, లోకేష్ ను తిట్టాడు. 2019లో సీపీఐ, సీపీఎం పార్టీలతో జత కలిసి, చెగువేరా ఫోటోను పట్టుకున్నాడు. ఆతరువాత చెగువేరా అయిపోయారని, పూలే అయిపోయారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బీజేపీ చీల్చినప్పుడు నిద్రపట్టలేదని, ప్రత్యేక హోదా, పాచిపోయిన లడ్డులు అంటూ బీజేపీని తిట్టాడని, ఆతరువాత ఇప్పుడు బీజేపీతో జతకట్టాడని పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు పల్లకి మోస్తున్నాడని నాని అన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఫై గట్టిగానే కౌంటర్లు, విమర్శలు చేసారు.