ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తీవ్ర అరోపణలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు.

కరోనా టైం లో కరోనా సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వార్తల్లో నిలిచినా శ్రీనివాసరావు..ఆ తరువాత పలు వివాదాలతో వార్తల్లో హైలైట్ అవుతూ వచ్చారు. నిత్యం ఏదొక వార్తతో మీడియా లో నిలిచే ఈయన..తాజాగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి హైలైట్ అయ్యాడు.

శుక్రవారం పోడు భూముల పంపిణీకి పాల్వంచకు వస్తున్న మంత్రి హరీష్ రావు కోసం జీఎస్ఆర్ ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదేశాలతో తీసేసింది మున్సిపల్ సిబ్బంది. ఈ తరుణంలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ హాట్‌ కామెంట్స్‌ చేశారు.