జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు

ఒలంపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులందరు ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిలు

న్యూఢిల్లీ : ఈనెల 15న జరిగే స్వాతంత్ర్య వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. భారతదేశం తరఫున ఒలంపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిలుగా ప్రధాని మోడీ ఆహ్వానించనున్నారు. దీనికి తోడు ఒలంపిక్ క్రీడాకారులందరితో తన నివాసంలో ప్రధాని ముఖాముఖీ సంభాషించనున్నారు.

కాగా, టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులను ప్రధాని మంగళవారం ఒక ట్వీట్‌లో అభినందించారు. ఈసారి ఇండియా నుంచి ఎక్కువ మంది ఒలంపిక్స్ క్రీడల్లో క్వాలిఫై కావడంపై కూడా ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌లో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో జరిపిన వర్చువల్ సమావేశంలోనూ ఒలంపిక్ క్రీడాకారుల ప్రతిభను ఆయన ప్రస్తావించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/