ప్రజలు బాధ్యతగా సహకరించాలి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan

Amaravati: రాష్ట్రంలో కరోనా నివారణ కోసం లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

వృద్ధులకు మరింత మంచి వైద్యాన్ని అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ ఇంటికి పరిమితం కావాలని సూచించారు. ఆ దిశగా అధికారులు కూడా వారిని సమాయత్తం చేయాలన్నారు.

ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను ఆదేశించారు.

అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా అడ్డుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకునేప్పుడు ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలని పేర్కొన్నారు.

అదే విధంగా అధికారులు అందరూ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో జరిగే కరోనా నివారణ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.

సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ ఛైర్మన్‌ సాంబశివారెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/