గూగుల్‍ కీలక నిర్ణయం

రక్షణ చర్యలు , సమాచారం కోసం వెబ్‍సైట్‍

covid-19 website

కరోనా వైరస్‍ నేపథ్యంలో గూగుల్‍ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‍పై అవగాహన కల్పించేందుకు తనదైన శైలిలో స్పందించింది.

వైరస్‍ నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమయ్యే సమాచారం కోసం ఓ వెబ్‍సైట్‍ను ప్రారంభించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ మీడియా సమావేశం నిర్వహించిన వారం తర్వాత గూగుల్‍ ఈ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యంగా కరోనా  వైరస్‍ కోసం గూగుల్‍ ఒక స్క్రీనింగ్‍ వెబ్‍సైట్‍ తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను నిర్దేశించాలని ట్రంప్‍ పేర్కొన్న నేపథ్యంలోwww.google.com/covid19/ అనే వెబ్‍సైట్‍ను తీసుకొచ్చింది.

ఈ అవగాహన, నివారణ, స్థానిక వనరులపై ఈ వెబ్‍సైట్‍ దృష్టి కేంద్రీకరించింది.

కోవిడ్‍-19 .. రాష్ట్రాల ఆధారంగా, భద్రత, నివారణ మార్గాలతో పాటు కోవిడ్‍ సంబంధ సెర్చ్, ఇతర సమాచారం లభిస్తుందని గూగుల్‍ తెలిపింది.

సెర్ఛ్ ఫలితాల్లో, గూగుల్‍ మ్యాప్స్లో నేరుగా కరోనా వైరస్‍ గురించి నమ్మదగిన సమాచారం అందేలా చేస్తామని తెలిపింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/