ఇన్ స్టాగ్రామ్ సంపాదన

సెలబ్రెటీలు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ సంపాదన
Priyanka chopra

ముఖ్యంగా స్టార్స్ సినిమాల్లో నటించినందుకు పారితోషికం అందుకుంటూ పలు సంస్థల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. మరో వైపు స్టేజ్ షోలతో కూడా సంపాదన వెనకేసుకుంటున్నారు.

ఇక ఈ మద్య కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా టైమ్ లైన్ లో ఒక్క పోస్ట్ పెట్టేందుకు లక్షలు కోట్లు వసూళ్లు చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా ప్రియాంక చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఒక యాడ్ ను పోస్ట్ చేసేందుకు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అందుకున్నట్లుగా తెలుస్తోంది. 50 మిలియన్ ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ప్రియాంక చోప్రా ఇండియా లో అత్యధికం గా ఇన్ స్టాగ్రామ్ ద్వారా సంపాదిస్తున్న బ్యూటీగా నిలిచింది.

ఈమెకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆ కారణంగానే ఈ అమ్మడి ఖాతాకు భారీ డిమాండ్ ఉంది.

ఈమె ఇన్స్టా ఖాతాలో ఒక్క పోస్ట్ పెడితే అయిదు కోట్ల మందికి అది చేరుతుందనే ఉద్దేశ్యంతో పలు కంపెనీల వారు ఆమెతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగానే కాకుండా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా.. బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కోట్ల రూపాయలను దక్కించుకుంటుందని ఫోర్బ్స్ వెళ్లడి చేసింది. 

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/