బిజెపి సీనియర్‌ నేతలను కలిసిన సింధియా

అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లతో సింధియా భేటి

Scindia-meets-Shah-Rajnath
Scindia-meets-Shah-Rajnath

న్యూఢిల్లీ: జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. నేడు సింధియా ఆపార్టీ సీనియర్‌ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లను కలిశారు. ఈరోజు ఉదయం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ నివాసానికి వెళ్లిన సింధియా ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి నుండి హోమంత్రి అమిత్‌షా ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సింధియాను కలిసిన ఫొటిను అమిత్‌షా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘సింధియా రాకతో మధ్యప్రదేశ్‌లో ప్రజలకు సేవ చేయాలన్న బిజెపి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని అమిత్‌షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ త జ్యోతిరాదిత్య సింధియా రాకతో బిజెపి మరింత బలోపేతమవుతుందని అన్నారు. నేడు జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమయ్యాను. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సింధియా రాకపతో పార్టీ మరింత బలోపేతమవుతుంది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నానుు అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/