ఇండిగో సిబ్బంది ఫై న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్ ఆగ్ర‌హం

ఇండిగో సిబ్బంది ఫై న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్ ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. విమాన ప్ర‌యాణంలో త‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైనా విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తాజాగా ఈమె ఇండిగో విమానంలో ప్ర‌యాణించింద‌ట‌. ఈ సంద‌ర్భంగా త‌న ల‌గేజీని ఇండిగో విమాన సిబ్బంది నిర్ల‌క్ష్యంగా విసిరిపారేశార‌ట‌. దీంతో త‌న ల‌గేజీ డ్యామేజీ అయ్యింద‌ని పేర్కొన్న పాయ‌ల్‌… ఈ ప్ర‌యాణంలో త‌న‌కు ఎన్న‌డూ ఎదుర‌వ‌ని చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా డ్యామేజీ అయిన త‌న ల‌గేజీ ఫొటోల‌ను కూడా ఆమె త‌న పోస్ట్‌కు జ‌త చేశారు.

RX100 మూవీ తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన పాయల్..ఫస్ట్ మూవీ తోనే యూత్ కు దగ్గరైంది. ఆ తర్వాత యంగ్ హీరోలతో పాటు వెంకటేష్ , రవితేజ వంటి సీనియర్ హీరోల పక్కన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈమె మంచు విష్ణు సరసన జిన్నా మూవీ లో నటించింది. ఈ మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ చూస్తున్నారు. ఈ మూవీ లో పాయల్ తో పాటు సన్నీ లియోన్ కూడా మరో హీరోయిన్ గా నటించింది.