ఉడతా ఉడతా ఊచ్ అంటూ జగన్ సర్కార్ ఫై పవన్ సెటైర్లు

పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన టెన్షన్ వాతావరణానికి దారితీసిన సంగతి తెలిసిందే. శుక్రవారం వైస్సార్సీపీ మంత్రుల కార్ల ఫై జనసేన కార్యకర్తలు దాడి చేసారని , ఈ దాడి చేయించింది పవన్ కళ్యాణ్ అని వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తూ వారి ఫై కేసులు పెట్టడం..పోలీసులు 92 మంది ఫై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ను విశాఖ ను వదిలి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేసారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం పవన్ వైజాగ్ లోని నోవొటెల్ లో ఉన్నారు. తదుపరి కార్య చరణ ఫై నేతలతో చర్చిస్తున్నారు.

ఇక ట్విట్టర్ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఉడతా ఉడతా ఊచ్ అంటూ సెటైర్లు పేల్చారు. ‘ఉడతా..ఉడతా.. ఊచ్‌ అంటూ ప్రాసలు పోస్ట్‌ చేసిన పవన్‌, ఉడతా..ఉడతా.. ఊచ్‌, ఎక్కడికెళ్తావోచ్‌.. రుషికొండ మీద జామపండు కోసుకొస్తావా?.. అంటూ ట్వీట్ చేశారు. మా వైసీపీకి ఇస్తావా?, మా థానోస్‌ గూట్లో పెడతావా’ అంటూ ఎద్దేవా చేశారు.

మరో వీడియోను ట్వీట్ చేసి.. ‘ప్రముఖ సీఎం నాయకత్వంలో మన ప్రియతమ ఏపీ పోలీసులు అంటూ ట్వీట్ చేశారు. తనను జనసేన కార్యక్రమాలు, ర్యాలీలు,..సమావేశాలు నిర్వహించకూడదని నిషేధించారు. తన గది కిటికీ నుంచి ఈ దృశ్యాన్ని మాత్రమే తనకు అందించారని’అన్నారు. విశాఖ పోలీసుల తీరును తప్పుబట్టారు. తన రూమ్ నుంచి కిటికీ లోంచి పలకరించవద్దని.. ఏపీ పోలీసులు తనకు చెప్పరని ఆశిస్తున్నాను అన్నారు. అలాగే చల్లగాలి కోసం ఆర్కే బీచ్‌కు వెళ్లాలని ఉందని, అనుమతి ఉందా? అంటూ పవన్ మరో ట్వీట్‌ చేశారు. వెళదాం.. తాను సిద్ధమంటూ నాగబాబు స్పందించారు.