నర్సులందరికి శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కళ్యాణ్‌

pawan kalyan
pawan kalyan

అమరావతి: నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో నర్సులు చేస్తున్న సేవలు ప్రశంశనీయమని అన్నారు, ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కూడా ఆసుపత్రుల్లో, ఐసోలేషన్‌ వార్డుల్లో నర్సులు చేస్తున్న సేవలు సర్వదా ప్రశంశనీయమని, భాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకీ నా తరపున, జనసేన తరుపున అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి రిత్యా వారు నర్సులు అయినప్పటికి ఆసుపత్రులలో వారిని సిస్టర్‌ అని పిలుస్తాము. ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా భావించి సపర్యలు చేస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్ధమైన నర్సులు మరింత మంది రావాలనే విషయాన్ని వైద్యనిపుణులు చెబుతున్నారని అన్నారు, నర్సు వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భధ్రత కల్పిస్తూ, గౌరవప్రదమైన వేతనం అందించేలా ప్రభుత్వాలు దృష్టి సారించాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/