‘మా’ ఎన్నికలు : నామినేషన్ వేసిన బండ్ల గణేశ్‌..

అక్టోబర్ 10 న ‘మా’ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కొక్కరు నామినేషన్లు వేయడం మొదలుపెట్టారు. ప్రకాష్‌ రాజ్‌ తన ప్యానెల్ సభ్యులు నామినేషన్స్ దాఖలు చేసారు. అలాగే స్వతంత్ర సభ్యుడి గా బరిలో దిగుతున్న నటుడు బండ్ల గణేశ్ జనరల్ సెక్రెటరీగా నామినేషన్ దాఖలు చేశారు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహానుభావులు 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారని ఇప్పటివరకు ప్రతి అధ్యక్షుడు బాగానే పని చేశారని కొనియాడారు. గత ప్రెసిడెంట్‌ని అన్యాయంగా దింపే ప్రయత్నం చేశారని, తాజాగా ఇప్పుడు కొంతమంది వచ్చి సభ్యులను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. మన హీరోలందరిని తీసుకొచ్చి ప్రోగ్రామ్ పెట్టి ఫండ్ కలెక్ట్ చేసి100మంది సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని హామి ఇచ్చారు. తాను మా బిల్డింగ్ కట్టనని, ఇప్పుడున్న ఆఫీస్ సరిపోతుందని పేర్కొన్నారు.మా బిల్డింగ్ కడతాను, చార్మినార్ కడతాను, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతున్నారని, కానీ అవేమి జరిగే పనులు కావని అన్ని అబద్ధాలని విమర్శించారు.