ఆ ఇద్దరి నేతల ఫై జగన్ సీరియస్..

ఆ ఇద్దరి నేతల ఫై జగన్ సీరియస్..
cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపీ భరత్..ఎమ్మెల్యే రాజాలపై సీరియస్ గా ఉన్నారు. గతంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగగా.. ఇప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఓపెన్ గా ఒకరిపై మరొకరు సవాళ్లు చేసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఆ ఇద్దరి నేతలను అమరావతికి పిలించాలని ఆదేశించినట్లు సమాచారం.

గతంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైన సమయంలో సుబ్బారెడ్డి మాట్లాడి సయోధ్య కుదిర్చారు. తిరిగి కొంత కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. తాజాగా ఒక వ్యక్తి పైన దాడి విషయంలో చోటు చేసుకున్న వివాదంలో ఇద్దరి మధ్య తిరిగి ఆధిపత్య పోరు మొదలైంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. దీంతో..మంగళవారం ఇద్దరితోనూ సుబ్బారెడ్డి ముందుగా మాట్లాడనున్నారు. వారిచ్చే సమాధానం ఆధారంగా వారితో కలిసి సీఎం వద్దకు వెళ్లనున్నారు. సీఎం ఇప్పటికే ఇద్దరు నేతల పైన ఆగ్రహంతో ఉండటంతో ఈ నేతలిద్దరి పైన ఏ స్థాయిలో రియాక్ట్ అవుతారు.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.