రేపు మూడు రాజధానులపై జనసేన కీలక భేటి

భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన వెలువడే అవకాశం

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: జనసేన రేపు మూడు రాజధానుల విషయంపై కీలక సమావేశం నిర్వహించనుంది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో మూడు రాజధానులపై నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అమరావతి రైతులకు జనసేన అండ ఎలా ఉండాలనే విషయంపై కూడా చర్చలు జరపనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణపై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఆగస్టు 15వ తేదీన విశాఖ రాజధానికి శంకుస్థాపన చేసే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/