వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్న గంటా శ్రీనివాస్‌?

సుముఖంగా ఉన్న జగన్

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైఎస్‌ఆర్‌సిపిలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే అందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. సిఎం జగన్ కు సన్నిహితులైన వ్యక్తులతో చర్చలు ముగిశాయని, వైఎస్‌ఆర్‌సిపిలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని గంటా సన్నిహితులు కూడా చెపుతున్నారు.

ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే రోజున వైఎస్‌ఆర్‌సిపిలో గంటా చేరనున్నట్టు సమాచారం. మరోవైపు గంటా చేరికపై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని… అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉన్నారని చెపుతున్నారు. రానున్న రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/