పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరిన పేర్ని నాని

వైస్సార్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు దత్త పుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆదివారం బాపట్ల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేశారు. దాదాపు 80 కుటుంబాలకు సాయం అందజేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా ఏర్పటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..మరోసారి వైసీపీ సర్కార్ ఫై , ఆ పార్టీ నేతలపై విరుచుకపడ్డారు. వైసీపీ వారు పదే పదే తనను దత్తపుత్రుడు..దత్తపుత్రుడు అంటున్నారని నేను చంద్రబాబు దత్తపుత్రుడు కాదని , ప్రజలకు దత్తపుత్రుడు అని అన్నారు.

పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు.చంద్రబాబు దత్త పుత్రుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని ఛాలెంజ్‌ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది వాస్తవం కాదా?? ఇప్పుడు రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కాదా?? అని ఫైర్‌ అయ్యారు. అప్పుడు రైతుల గురించి ఎందుకు ప్రశ్నించ లేదని.. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ కు తెలుసు అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం సీఎం జగన్‌ తెచ్చిన పథకాలు అమలు చేస్తుంటే పవన్‌కి కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ‘2014లో తనను చూసి ఓటేయమన్నారు. టీడీపీ, బీజేపి తప్పు చేస్తే తాను ప్రశ్నిస్తానన్నారు. కానీ రైతులకు రుణమాఫీ పేరుతో టీడీపీ, బీజేపీ దగా చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు? , ఐదేళ్లలో కేవలం 15 వేల కోట్లను మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుంటే మీరేం చేస్తున్నారు?, ఎందుకు ఆనాడు మీ నోట మాట రాలేదు?, మీకు తెలిసిందల్లా కేవలం జగన్ ని ప్రశ్నించటం మాత్రమే అని నాని అన్నారు. 2024 ఎన్నికల్లో ఎవరితో వెళ్తారో చూద్దాం. అప్పుడు చంద్రబాబుకు దత్తపుత్రుడు అవునో, కాదో తేలుతుంది.