పవన్ ను ఎత్తుకొని హత్తుకున్న అల్లుడు సాయి ధరమ్

అసెంబ్లీ ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్తో జనసేన 21కి 21 స్థానాలు గెలుపొందడంతో అభినందనలు తెలిపేందుకు హీరో సాయి ధరమ్ తేజ్ జనసేనాని పవన్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గట్టిగా హత్తుకొని, ఎత్తుకొని తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ వీడియోను ఆయన షేర్ చేస్తూ.. ‘మీ గెలుపే మా పొగరు. మా జనసేనాని’ అని ట్వీట్ చేశారు. ‘పవన్ నా హీరో, నా గురువు, నా గుండె, ముఖ్యంగా నా సేనాని’ అని Xలో రాసుకొచ్చారు.

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయ డంఖా మోగించింది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. ఇక జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి సరికొత్త రికార్డ్స్ సృష్టించారు. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వెళతారు అనుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల కోసమే ఏపీలో అధికార పార్టీపై పోరాటం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై తన గళాన్ని వినిపించారు. ఈ ఎన్నికలలో ప్రజల మద్దతు కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రతీ చోటా తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక స్థానం అది కూడా తమది అని చెప్పుకోలేని స్థానం ఇచ్చిన ప్రజలు ఈసారి తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కు చేసిన అన్యాయం ఈసారి జరగకూడదని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలలోను విజయాన్ని కట్టబెట్టారు. ఏకంగా వంద శాతం పవన్ కళ్యాణ్ పార్టీకి విజయాన్ని ఇచ్చి ఒక్కసారిగా ప్రేమను కుమ్మరించారు.

మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని ❤️‍🔥😍 @pawankalyan garu my hero,my guru,my heart, most importantly MY SENANI 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/qD2oXYtONH— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024