ఎఫ్ 3 లో పవన్ కళ్యాణ్ కనిపిస్తారట..

ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3 . భారీ అంచనాల నడుమ ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ’ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. 2019 సంక్రాంతికి ఎఫ్ 2 విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరియర్ లోనేఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది.

ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 రాబోతుండడం తో అందరిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా తెరకెక్కిందని చిత్ర ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇదిలా ఉంటె ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారని దిల్ రాజు చెప్పి సినిమా ఫై మరింత అంచనాలు రెట్టింపు చేసారు. ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ F3 సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే కాదు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ ఉంటారని, అందుకు అనుగుణంగా అనిల్ రావిపూడి చక్కటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారని చెప్పుకొచ్చారు.

దాంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్షకులంతా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రేజీ మూవీలో త‌మ‌న్నా, మెహ‌రీన్, సోనాల్ చౌహాన్‌, అంజ‌లి, సునీల్‌, అన్న‌పూర్ణ‌మ్మ, వెన్నెల కిశోర్, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజాహెగ్డే స్పెష‌ల్ సాంగ్ లో మెర‌వనుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఎఫ్ 3 లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.