మాజీమంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

పిటిష‌నర్ల‌పై తొంద‌రపాటు చ‌ర్య‌లు వ‌ద్ద‌న్న హైకోర్టు
విచార‌ణ‌ను జూన్ 9కి వాయిదా వేసిన న్యాయస్థానం

ap-high-court-orders-ap-cid-officers-not-to-take-any-further-action-on-ex-minister-narayana

అమరావతి: టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌కు గురువారం హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. అమ‌రావ‌తి రింగ్ రోడ్డు భూ స‌మీక‌ర‌ణ‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి నారాయ‌ణ‌తో పాటు లింగ‌మ‌నేని సోద‌రులు, రామ‌కృష్ణ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ త‌దిత‌రుల‌పై ఏపీ సీఐడీ కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసుపై త‌దుప‌రి చ‌ర్య‌లను నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ నారాయ‌ణ‌తో పాటు లింగ‌మ‌నేని సోద‌రులు, రామ‌కృష్ణ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు… పిటిష‌నర్ల‌పై తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు వ‌ద్దంటూ సీఐడీ అధికారుల‌కు హైకోర్టు సూచించింది. ఈ కేసులో పిటిష‌నర్ల‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్దంటూ మ‌ధ్యంత‌ర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచార‌ణ‌ను జూన్ 9కి వాయిదా వేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: