పంజాబ్‌లో పోలీస్‌స్టేషన్‌పై రాకెట్‌ గ్రనేడ్‌తో దాడి

Rocket-propelled grenade hits police station in Punjab’s Tarn Taran, Pak link suspected

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌లో దుండగులు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌పై రాకెట్‌ గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌ బయటి పిల్లర్‌కు రాకెట్‌ గ్రనేడ్‌ తగిలింది. అయితే పిల్లర్‌కు తగిలిన తర్వాత అది ఎగరడంతో భారీ ప్రమాదం తప్పింది. స్టేషన్‌ స్వల్పంగానే ధ్వంసమయిందని, ఎవరి ఎలాంటి ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు మొదలు పెట్టారు. కాగా, తర్న్‌ తరన్‌ పోలీస్‌ స్టేషన్‌ను పంజాబ్‌ డీజీపీ, ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించనున్నారు.

కాగా, రాకెట్‌ చాలా శక్తివంతమైనదని అయితే పిల్లర్‌కు ఢీకొట్టిన తర్వత అది మళ్లీ ఎగరడంతో స్టేషన్‌ను ధ్వంసం చేయలేకపోయిందని నిపుణులు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/